మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య

కృష్ణా: భార్య మాట వినటంలేదని మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. కొత్తపేట పోలీసుల కథనం మేరకు.. జక్కంపూడికి చెందిన అనిల్ కుమార్ తాపీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతని భార్య ఓ బైండింగ్ షాప్‌లో పనిచేస్తూ ఉంటుంది. భార్యను పనికి వెళ్లవద్దంటూ అనిల్ కుమార్ హెచ్చరిస్తూ ఉన్నాడు. అయినా ఆమె పనికి వెళ్లడంతో బుధవారం ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.