అగ్ని ప్రమాదంలో వరికుప్పలు దగ్ధం

అగ్ని ప్రమాదంలో వరికుప్పలు దగ్ధం

AKP: నాతవరం మండలం ఎంబిపట్నం గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన వాల్తేరు రాజబాబు అనే వ్యక్తికి సంబంధించిన గడ్డివాము, పశువులపాక దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న నర్సీపట్నం ఫైర్ ఆఫీసర్ అప్పలస్వామి ఆధ్వర్యంలో ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి వెళ్లి మంటలను అర్పివేశారు. దాదాపు రెండు లక్షల రూపాయలు నష్టం జరిగి ఉంటుందన్నారు.