కాణిపాక ఆలయ హుండీ ఆదాయం ఎంతంటే..?

కాణిపాక ఆలయ హుండీ ఆదాయం ఎంతంటే..?

CTR: కాణిపాక వరసిద్ధి వినాయకస్వామి ఆలయ హుండీ లెక్కింపులో మొత్తం రూ.1,76,77,666 ఆదాయం లభించింది. శుక్రవారం ఆస్థాన మండపంలో ఈవో పెంచల కిషోర్ పర్యవేక్షణలో సిబ్బంది కానుకలను లెక్కించారు. హుండీలో 53 గ్రాముల బంగారం, 790 గ్రాముల వెండి, అలాగే విదేశీ కరెన్సీగా యూఎస్ఏ 1,357 డాలర్లు, యూఏఈ 145 దిర్హామ్‌లు, ఆస్ట్రేలియా 235 డాలర్లు, ఇంగ్లాండ్ 35 పౌండ్లు కానుకలు వచ్చాయి.