అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యం పట్టివేత

అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యం పట్టివేత

WNP: వనపర్తిలోని గాంధీ నగర్లో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. పౌరసరఫరాల అధికారి దుబ్బాక పరమేష్ ఫిర్యాదు మేరకు పట్టణ ఎస్సై హరిప్రసాద్, పోలీస్ సిబ్బందితో కలిసి గాంధీ చౌక్‌లోని మహమ్మద్ ఖాజా ఇంట్లో దాడులు నిర్వహించి 5 క్వింటాళ్ల బియ్యాన్ని పట్టుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.