నరసాపురంలో 'రాయుడు గారి తాలూకా' చిత్ర యూనిట్ సందడి

నరసాపురంలో 'రాయుడు గారి తాలూకా' చిత్ర యూనిట్ సందడి

W.G: నరసాపురం అన్నపూర్ణ పిక్చర్ ప్యాలెస్‌లో 'రాయుడు గారి తాలూకా' చిత్ర బృందం ఆదివారం సందడి చేసింది. చిత్ర హీరో, రచయిత ఉలిశెట్టి శ్రీనివాస్, హీరోయిన్ సత్య యేశా, దర్శకుడు కొర్రపాటి నవీన్ తేజ అభిమానులతో కలిసి సినిమాను తిలకించారు. సినిమా హాల్ వద్ద హీరో, హీరోయిన్లను చూసేందుకు అభిమానులు తరలివచ్చారు. చిత్ర యూనిట్‌కు మెగా అభిమానులు ఘనస్వాగతం పలికారు.