వెల్దుర్తిలో కుళాయి పన్నుపై వివాదం
KRNL: వెల్దుర్తి మేజర్ గ్రామపంచాయతీలో 2026 సంవత్సరానికి సంబంధించిన పన్నుల వసూళ్లు ఇవాళ వివాదానికి దారి తీసాయి. కుళాయి పన్ను ఆన్‌లైన్‌లో రూ.1,200గా ఉండగా, అధికారులు ఆఫ్‌లైన్‌లో రూ.1,800 వసూలు చేస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యత్యాసంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. పంచాయతీ కార్యాలయం వద్ద అధికారులను గ్రామస్థులు నిలదీశారు.