'కుష్టు రహిత సమాజమే లక్ష్యం'

'కుష్టు రహిత సమాజమే లక్ష్యం'

SRPT: జిల్లాలో 'స్పర్శ' కుష్టు వ్యాధి అవగాహన కార్యక్రమాలు విజయవంతమైనట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ వెంకటరమణ తెలిపారు. 486 గ్రామ పంచాయతీల్లో 1,288 సదస్సులు నిర్వహించి, వ్యాధి లక్షణాలు, చికిత్సపై ప్రజలకు అవగాహన కల్పించామన్నారు. కుష్టుపై అపోహలు వీడాలని, గౌరవాన్ని కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.