విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో రాఖీ వేడుకలు

విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో రాఖీ వేడుకలు

జనగామ: పట్టణంలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో రక్షాబంధన్ ఉత్సవాలు గురువారం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారీగా మహిళలు పాల్గొని పురుషులకు రాఖీలు కట్టి అన్నా చెల్లెల ఆప్యాయతను పంచారు. అనంతరం సామూహికంగా మంగళహారతులు పట్టి తీపి మిఠాయి పంచుకున్నారు. నేను మీకు రక్ష, మీరు నాకు రక్ష మనందరం దేశానికి ధర్మానికి, సమాజానికి రక్షణగా నిలుద్దాం అంటూ సంకల్పం చేశారు.