బసవేశ్వరుడి సేవలు ఆచరణీయం: కేటీఆర్
TG: సబ్బండవర్గాల శ్రేయస్సు కోసం బసవేశ్వరుడు కృషి చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కొనియాడారు. బసవేశ్వరుడి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి కేటీఆర్ నివాళులర్పించి మాట్లాడారు. వివక్షాపూరిత, అమానవీయ సంబంధాలు రద్దు కావాలని, సమానత్వ భావన ఫరిడవిల్లాలని పోరాడిన మానవతావాది బసవేశ్వరుడు అని గుర్తుచేశారు.