'ప్రభుత్వ పథకాలు అర్హులకు అందేలా కృషి చేయాలి'
MHBD: ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులైన ప్రతి ఒక్కరికి చేరేలా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ సూచించారు. మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా స్థాయి సమావేశంలో టీ ప్రైడ్, తెలంగాణ ఐపాస్ వంటి పథకాలతో ఎస్సీ, ఎస్టీ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి,ఆర్థికంగా అభివృద్ధి చెందేలా చేయాలని అధికారులకు సూచించారు.