బైక్ ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు..!
KRNL: బెళగల్ (M) పోలకల్ సమీపం జిక్కజీవా వద్ద నిన్న 2 బైకులు ఢీకొన్నాయి. గూడూరుకు చెందిన మధు మద్యం సేవించి, ఆగి ఉన్న బైకును ఢీకొట్టడంతో ఆయన తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం.. మద్యం సేవించి బైక్ నడపడమే ప్రమాదానికి కారణమని తెలిపారు. సమాచారం అందుకున్న అంబులెన్స్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని, గాయపడిన మధును ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.