ఏబీవీపీ ఆధ్వర్యంలో ర్యాలీ, మానవహారం
KDP: రాష్ట్ర విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం గురువారం ABVP ఆధ్వర్యంలో మైదుకూరులో విద్యార్థి భరోసా యాత్ర నిర్వహించారు. మైదుకూరులోని విఆర్ కళాశాల నుంచి శ్రీకృష్ణదేవరాయల కూడలి వరకు ర్యాలీ చేసి మానవహారం ఏర్పాటు చేశారు. పెండింగ్ స్కాలర్‌షిప్‌లు ఫీజు రియంబర్స్‌మెంట్‌లు వెంటనే విడుదల చేయాలని, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకోవాలని ABVP నాయకులు డిమాండ్ చేశారు.