హిందూపురంలో ప్రతిభావంతుల దినోత్సవం

హిందూపురంలో ప్రతిభావంతుల దినోత్సవం

SS: హిందూపురం భవిత కేంద్రంలో విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హిందూపురం మున్సిపల్‌ ఛైర్మన్‌ రమేశ్‌ కుమార్, కమిషనర్‌ మల్లికార్జున పాల్గొన్నారు. మున్సిపల్ ఛైర్మన్ మాట్లాడుతూ.. దివ్యాంగులను ఎవరూ కించపరచరాదని, అన్ని రంగాల్లో వారు అభివృద్ధి చెందారని తెలిపారు. అనంతరం పిల్లలకు పెన్సిల్స్, క్రయాన్సు అందజేశారు.