నేడు వర్కింగ్ డే: DEO
CTR: చిత్తూరు జిల్లాలోని పాఠశాలలన్నీ రెండో శనివారం(నేడు) పనిచేస్తాయని డీఈఓ రాజేంద్రప్రసాద్ తెలిపారు. జవహర్ నవోదయ విద్యాలయంలో ప్రవేశానికి జిల్లా వ్యాప్తంగా 12 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ కేంద్రాలు ఏర్పాటు చేసిన పాఠశాలల్లో ఆరు నుంచి తొమ్మిదో తరగతి వరకు తరగతులు నిర్వహించాల్సిన అవసరం లేదన్నారు.