VIDEO: MIM ఫ్లెక్సీలను చింపేసిన మాధవీలత
HYD: సామూహిక ఇఫ్తార్ సందర్భంగా నగరంలో పలు చోట్ల ఎంఐఎం ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో జూబ్లీహిల్స్‌లోని విరించి ఆస్పత్రి ముందు ఏర్పాటు చేసిన MIM ఫ్లెక్సీలను BJP మహిళా నేత మాధవీలత చింపేసి మండిపడ్డారు. 'ఇఫ్తార్ విందులు పేదలు, ఆశ్రమంలోని అనాథలకు పెట్టాలి. రూ.కోట్లు ఖర్చు పెట్టి ధనవంతులకు దావత్‌లు సరికాదు. రంజాన్, ఇఫ్తార్ విందుల గురించి ఎంఐఎం తెలుసుకోవాలి' అని సూచించారు.