నీట మునిగిన పర్లపాడు ఎస్సీ కాలనీని సందర్శించిన ఆర్డీవో
KDP: రాత్రి కురిసిన వర్షానికి నీట మునిగిన రాజుపాలెం(M) పర్లపాడు (V) ఎస్సీ కాలనీని శనివారం జమ్మలమడుగు ఆర్డీవో సాయిశ్రీ సందర్శించారు. కాగా, ఎస్సీ కాలనీలోని ఇళ్లన్నీ నీట మునిగి, ఇళ్లలోకి నీరు చేరి సామాన్లు, ఆహార పదార్థాలు పూర్తిగా తడిచి పోయాయి. బాధితులను కలిసి RDO పరామర్శించారు. ఆమె వెంట రాజుపాలెం MRO మనోహర్ రెడ్డి, అధికారులు ఉన్నారు.