జాబ్ మేళాకు డిప్యూటీ సీఎం హాజరవుతారు: ఎమ్మెల్యే
BDK: సింగరేణి కాలరీస్ సౌజన్యంతో ఈ నెల 12న కొత్తగూడెం క్లబ్లో జరిగే మెగా జాబ్ మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కోరారు. ఈ మేళా ప్రారంభోత్సవానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హాజరవుతారని వారు గురువారం తెలిపారు. ఈ జాబ్ మేళాకు 50కి పైగా కంపెనీలు హాజరవుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు.