'సత్యవరంలో రహదారి పనులు ప్రారంభం'

SKLM: నరసన్నపేట మండలం సత్యవరం గ్రామంలో రహదారి నిర్మాణ పనులను ప్రారంభించామని ఎంపీపీ అరంగి మురళీధర్ తెలిపారు. ఇవాళ ఈ మేరకు స్థానిక గ్రామంలోని పాఠశాల రహదారిలో మండల పరిషత్ నిధులతో నిర్మాణాన్ని చేపడుతున్నామని ఆయన తెలియజేశారు. రెండు లక్షల రూపాయలు నిధులు మంజూరు చేశారని వార్డ్ సభ్యులు నీలం రాజు, సీర లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.