విద్యార్థులకు బండి సంజయ్ గుడ్‌న్యూస్

విద్యార్థులకు బండి సంజయ్ గుడ్‌న్యూస్

TG: పదో తరగతి విద్యార్థులకు కేంద్రమంత్రి బండి సంజయ్ నజరానా ప్రకటించారు. మోదీ గిఫ్ట్ పేరుతో పరీక్ష ఫీజు చెలిస్తానని హామీ ఇచ్చారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఫీజు చెల్లిస్తానని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల కలెక్టర్లకు లేఖ రాశారు. కాగా, ఇందుకోసం రూ.15 లక్షలకు పైగా ఖర్చు కానున్నట్లు సమాచారం.