భారత్‌కు ఇరాన్ ముడిచమురు

భారత్‌కు ఇరాన్ ముడిచమురు

ఇరాన్ ముడి చమురుపై ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు ఇటీవల అమెరికా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇరాన్ నుంచి దాదాపు 6,00,000 బ్యారెళ్ల చమురుతో ఓ ఆయిల్ ట్యాంకర్ భారత్ వైపు బయల్దేరింది. ఏప్రిల్ 4న గుజరాత్ వాడినార్ పోర్టుకు ఇది చేరుకోనుందని డేటా ఇంటెలిజెన్స్ సంస్థ క్లెప్లర్ వెల్లడించింది. 2019 తర్వాత ఇరాన్ చమురు భారత్‌కు రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.