హాస్టల్ గోడ కూలిన ఘటనపై మంత్రి ఆదేశాలు

SRD: రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా మంగళవారం మునిపల్లి మండలం లింగంపల్లిలోని గురుకుల పాఠశాలలో హాస్టల్ గోడ కూలి ముగ్గురు విద్యార్థులు స్వల్పంగా గాయపడిన ఘటనపై తక్షణం స్పందించారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను పరిశీలించాలని ఆదేశించారు. అలాగే విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.