'సమాజ సేవలోనే ఆనందం'

W.G: సమాజం మనకు ఇచ్చిన దానిలో ఎంతో కొంత సమాజానికి సహాయం చేయాలని షాలేమ్ సామాజిక సేవ సంస్థ ఛైర్మన్, రాష్ట్ర మాదిగ సంక్షేమ పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షులు తెన్నేటి సురేష్ మాదిగ అన్నారు. శనివారం నర్సాపురం పట్టణం లాకుపేటలో పలువురి వితంతువులకు, పేదలకు సంస్థ తరపున నిత్యవసర సరుకులు అందజేశారు. ఇతరులకు సహాయం చేయడం ద్వారా ఆనందం, సంతృప్తి కలుగుతుంది అన్నారు.