చలి ఎక్కువైతే గుండెపోటు.. ఇలా చేయండి..!
చల్లని ఉష్ణోగ్రతతో రక్తనాళాలు సంకోచించడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే శీతాకాలంలో గుండెపోటు బారిన పడే వారి సంఖ్య అధికంగా ఉంటుందన్నారు. గుండెపోటు వచ్చిన వారికి CPR చేయడంతో ప్రాణాలు రక్షించవచ్చని చెప్పారు. నిమిషానికి 100 నుంచి 120 సార్లు ఛాతీపై నొక్కితే గుండెలోకి రక్తం నిండుగా చేరడానికి సహాయపడుతుందని తెలిపారు.