రాష్ట్రంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, నాగర్ కర్నూల్, మహబూబ్‌నగర్, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.