ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన హౌసింగ్ పీడీ

ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన హౌసింగ్ పీడీ

NLG: పార్టీలకతీతంగా అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడం జరుగుతుందని హౌసింగ్ పీడీ రాజ్ కుమార్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి అన్నారు. నల్లగొండ పట్టణంలోని 14వ వార్డు మర్రిగూడలో నూతి లక్ష్మయ్య నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిని ఈరోజు వారు ప్రారంభించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడారు.