750 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా

750 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా

MDCL: జిల్లా, బాచుపల్లి మండలం, నిజాంపేట సర్వే నం. 191లో కబ్జా అయిన 10 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా స్వాధీనం చేసుకుంది. దీని విలువ రూ. 750 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. స్థానికుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన హైడ్రా, ఆక్రమణలను నిర్ధారించింది. శాశ్వత నివాసాలు మినహా షెడ్లు, ప్రహరీలను తొలగించి, ఆ 10 ఎకరాల భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసి, బోర్డులు ఏర్పాటు చేసింది.