'జూనియర్ కళాశాలల్లో మరమ్మతులు చేపట్టాలి'

NZB: జూనియర్ కళాశాలల్లో అమ్మ ఆదర్శ కమిటీల నేతృత్వంలో మరమ్మతులు చేపట్టాలని ఇంటర్ బోర్డు జిల్లా ప్రత్యేక అధికారి ఒడ్డెన్న తెలిపారు. జిల్లా కార్యాలయంలో నేడు అన్ని కళాశాలల ప్రిన్సిపాళ్లతో సమావేశం నిర్వహించి మాట్లాడుతూ.. ఇంటర్ బోర్డు కేటాయించిన నిధులను వినియోగించడానికి అమ్మ ఆదర్శ కమిటీ ఛైర్ పర్సన్‌లు, ప్రిన్సిపాల్‌ల పేరుపై జాయింట్ అకౌంట్ తీసుకోవాలని సూచించారు.