'నియోజకవర్గం అభివృద్ధి చేయాలన్నదే నా సంకల్పం'
JN: తనను ఎన్నుకున్న ప్రజలకు న్యాయం చేయడం, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలన్నదే తన సంకల్పం అని MLA కడియం శ్రీహరి అన్నారు. గురువారం జరిగిన ఒక కార్యక్రమంలో MLA మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని ప్రతీ గ్రామానికి గోదావరి జలాలు తీసుకువచ్చి, ప్రతీ ఎకరానికి 2 పంటలకు సాగునీరు అందించాలన్నదే ఏకైక లక్ష్యంగా పనిచేన్నానన్నారు. తాను ఎప్పుడూ ఏ తప్పు చేయలేదని చెప్పారు.