అనధికార లేఅవుట్లపై మున్సిపాలిటీ చర్యలు
కడప: బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని మడకలవారిపల్లె (సర్వే నం. 887) అనధికార లేఅవుట్‌ను కమిషనర్ నరసింహారెడ్డి పరిశీలించారు. LRLకు బౌండరీ స్టోన్‌లు, కాంపౌండ్ గోడలను తొలగించారు. మొత్తం 16 అనధికార లేఅవుట్ల యజమానులు 2026 జనవరి 23లోపు LRL కోసం తప్పనిసరిగా దరఖాస్తు చేయాలని, లేనిపక్షంలో ముందస్తు నోటీసులు లేకుండా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.