నగరపంచాయతీ కమిషనర్‌గా బాధ్యతల స్వీకరణ

VZM: నెల్లిమర్ల నగరపంచాయతీ కమిషనర్‌గా ఏ.తారక్ నాథ్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. అమలాపురం మునిసిపల్ రెవెన్యూ అధికారిగా పనిచేసిన ఆయన బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఇంతవరకూ ఇక్కడ అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న అప్పలరాజు ఇటీవల విజయనగరం కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్‌గా బదిలీపై వెళ్లారు. విధుల్లో చేరిన తారక్ నాథ్‌ను అప్పలరాజు, సిబ్బంది అభినందించారు.