'కానుకుంట రోడ్డుకు మరమ్మత్తు చేయాలి'

SRD: పటాన్‌చెరు నియోజకవర్గం గుమ్మడిదల మండల కానుకుంట గ్రామ ప్రధాన రహదారి అకాల వర్షాలకు గుంతలు పడి ప్రమాదాలకు నిలయంగా మారింది. ఈ సందర్భంగా గురువారం CPM, CITU నాయకుల ఆధ్వర్యంలో స్థానిక MRO కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం MROకు వినతి పత్రం సమర్పించారు. అధికారులు వెంటనే రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని నాయకులు డిమాండ్ చేశారు.