APSPDCLలో కడపకు ప్రథమ స్థానం

KDP: APSPDCL పరిధిలో కడప జిల్లా తొలి స్థానంలో నిలిచింది. ఈ మేరకు ఆ సంస్థ సీఎండీ సంతోష్ రావు చేతుల మీదుగా కడప ఎస్ఈ రమణ ప్రశంసా పత్రంతో పాటు జ్ఞాపిక అందుకున్నారు. తిరుపతి కార్పొరేషన్ కార్యాలయంలో శనివారం ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కాగా, విద్యుత్ ప్రమాదాల నివారణ, వినియోగదారులకు మెరుగైన సేవలు, వాట్సప్ ద్వారా ఫిర్యాదుల స్వీకరణను పరిగణలోకి తీసుకుని ఈ అవార్డు అందించారు.