భూమన బెదిరింపులకు భయపడం: ఎమ్మెల్యే

CTR: వైసీపీ నేత భూమన బెదిరింపులకు భయపడేవారు ఎవరూ లేరని పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్‌లో గురువారం ఆయన మాట్లాడుతూ.. టీటీడీని వైసీపీ తన రాజకీయ అవసరాలకు ఉపయోగించుకుంటోందని ఆరోపించారు. ఛైర్మన్ బీఆర్ నాయుడుపై భూమన చేసిన ఆరోపణలను ఖండించారు. వైసీపీ హయాంలో ఎన్నో అరాచకాలు చోటు చేసుకున్నాయని ఆయన అన్నారు.