కూకట్‌పల్లి రామాలయ కుంభప్రోక్షణకు గవర్నర్‌కు ఆహ్వానం

కూకట్‌పల్లి రామాలయ కుంభప్రోక్షణకు గవర్నర్‌కు ఆహ్వానం

RR: కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో మే 1న జరగనున్న రామాలయ కుంభప్రోక్షణ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లను రాజ్‌భవన్‌లో కలిసి సాదరంగా ఆహ్వానించారు. ఈ ఆధ్యాత్మిక వేడుకకు విచ్చేయవలసిందిగా వారు గవర్నర్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో సందీప్ రావు, మాజీ కార్పొరేటర్ రంగారావు, రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.