VIDEO: సర్దార్ తండాలో కాళుబాబా ఉత్సవాలు

VIDEO: సర్దార్ తండాలో  కాళుబాబా ఉత్సవాలు

SRD: కంగ్టి మండలం సర్దార్ తాండ గ్రామపంచాయతీలోని కాళుబాబా మందిరం వద్ద మథుర (కయిత) లంబాడీలు వార్షికోత్సవ పంచమి వేడుకలు గురువారం ఘనంగా జరుపుకుంటున్నారు. అంతకుముందు ఆలయం ఎదుట తమ ఆచార సాంప్రదాయ కోలాటాలు, డమరుకం మోగిస్తూ నృత్యాలు చేస్తూ జాగరణ చేశారు. అనంతరం తమ ఆరాధ్య దేవుడు కాళుబాబాకు విశేష పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పించారు. అనంతరం అన్నదానం చేశారు.