రోడ్డు భద్రతపై వాహనదారులకు అవగాహన

రోడ్డు భద్రతపై వాహనదారులకు అవగాహన

KMR: బిచ్కుంద మండల కేంద్రంలో వాహనదారులకు రవాణా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మోటర్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ రజని మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణం చేసేటప్పుడు సీట్ బెల్టు ధరించాలని పేర్కొన్నారు. రోడ్డు భద్రత నియమాలు పాటిస్తే రోడ్డు ప్రమాదాలు నివారించ వచ్చని సూచించారు.