మాక్రాన్‌తో ఫోన్‌లో మాట్లాడిన మోదీ

మాక్రాన్‌తో ఫోన్‌లో మాట్లాడిన మోదీ

ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌తో PM మోదీ ఫోన్‌లో మాట్లాడారు. పశ్చిమాసియా ప్రాంతంలో నెలకొన్న పరిస్థితులు, అక్కడ ఉద్రిక్తతలు తగ్గించాల్సిన ఆవశ్యకతపై చర్చించినట్లు మోదీ తెలిపారు. ఘర్షణలకు ముగింపు పలికేలా చర్చలు, దౌత్య మార్గాలను పునఃప్రారంభించాల్సి ఉందని చెప్పారు. ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం నెలకొల్పేందుకు ఇరు దేశాల సమన్వయంతో ముందుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.