VIDEO: పూర్తిగా కొట్టుకుపోయిన రోడ్డు.. పట్టించుకోని అధికారులు

NGKL: ఊర్కోండ మండలం మాదారం-సిర్సవాడ గ్రామాల మధ్య దుందుభి నదిపై ఉన్న ప్రధాన రహదారి భారీ వర్షాలకు పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో రెండు గ్రామాల మధ్య పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్డు దెబ్బతిని 20 రోజులైనా అధికారులు పట్టించుకోవడంలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేయాలని స్థానికులు కోరుతున్నారు.