జిల్లాలో పర్యటించనున్న ఛైర్మన్
VZM: రాష్ట్ర అధికార భాషా సంఘం ఛైర్మన్ విక్రమ్ పూల విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారని తెలుగు భాషా పరిరక్షణ సమితి వ్యవస్ధాపక అధ్యక్షులు సముద్రాల గురుప్రసాద్ పేర్కొన్నారు. 21వ తేదీన అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగు భాషా పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉత్సవంలో ఆయన పాల్గొంటారని అన్నారు.