VIDEO: ఆటోలో ప్రయాణించిన కలెక్టర్, ఎమ్మెల్యే

WGL: పర్వతగిరి మండలంలోని వడ్లకొండ గ్రామంలో చెరువులు పరిశీలించడానికి వచ్చిన కలెక్టర్ డాక్టర్ సత్య శారద, ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు తిరుగు ప్రయాణంలో ఇవాళ ఆటోలో ప్రయాణించారు. చెరువు కట్ట ప్రమాదంగా ఉండటంతో కార్లు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో కొద్దిదూరం నడకదారిలో వెళ్లి ఆపై ఆటోలో ప్రయాణించారు.