ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందజేసిన వైద్య సిబ్బంది

ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందజేసిన వైద్య సిబ్బంది

MNCL: జన్నారం మండల కేంద్రంలో ప్రభుత్వ వైద్య సిబ్బంది ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందజేశారు. ఎండలు మండిపోతుండడంతో ప్రజలు డీహైడ్రేషన్ బారిన పడకుండా ప్రభుత్వ వైద్యాధికారి ఆదేశాల మేరకు వారు మంగళవారం రోజున స్థానిక బస్టాండు, చలివేంద్రం తదితర ప్రాంతాలలో ప్రజలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్లు పోచయ్య, రాంబాబు పాల్గొన్నారు.