'సీఐటీయు జిల్లా మహాసభలను జయప్రదం చేయండి'
ప్రకాశం: ప్రభుత్వం కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం నవంబర్ 8 ,9 తేదీన దర్శిలో జరిగే సీఐటీయూ 13వ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని జిల్లా సీఐటీయు కమిటీ సభ్యులు రాయల మాలకొండయ్య పిలుపునిచ్చారు. ఇవాళ సీ యస్ పురంలో మహాసభల కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మిక వర్గ హక్కుల రక్షణకు సమస్యల పరిష్కార సాధనకై నిరంతరం పోరాడుతుందన్నారు.