నేలకొండపల్లిలో జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు
KMM: నేలకొండపల్లిలోని స్థానిక సెంటర్‌లో ఇవాళ MRPS ఆధ్వర్యంలో స్వాతంత్య్ర సమరయోధుడు, దళిత నాయకుడు, మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సామాజిక న్యాయం, అణగారిన వర్గాల అభివృద్ధికి ఆయన చేసిన కృషిని వారు స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో MRPS మండల అధ్యక్షులు మాదాసి వెంకన్న, జాతీయ నాయకుడు వంగూరి ఆనందరావు, జిల్లా నాయకులు, CITU నేతలు పాల్గొన్నారు.