వరద నీటితో నిలిచిన రాకపోకలు

NTR: నందిగామ మండలం దాములూరు వద్ద ఉన్న వైరా కట్టలేరు వాగుకు వరద ఉధృతి కొనసాగుతోంది. వారం రోజులుగా నందిగామ, వీరులపాడు మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. బ్రిడ్జి నిర్మాణం పూర్తయినా, అప్రోచ్ రోడ్డు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరద నీటిలో మునిగిన పంట పొలాలను చూసుకోవడానికి కూడా వీలు లేకుండా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.