VIDEO: కంకిపాడులో నేలకొరిగిన భారీ వృక్షం

కృష్ణా: కంకిపాడులో ఆదివారం ఉదయం భారీ వర్షం కురిసింది. బలమైన ఈదురు గాలులు వీయడంతో ప్రధాన రహదారిపై భారీ వృక్షం నేలకొరిగింది. దీంతో ఆ రహదారిలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎండల తీవ్రత నేపథ్యంలో నేడు కురిసిన వర్షానికి ప్రజలు కాస్త ఉపశమనం పొందారు.