మొగుళ్లపల్లి బీఎస్పీ అధ్యక్షుడి నియామకం

BHPL: మొగుళ్లపల్లి మండల బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షుడిగా చిరంజీవి, ఉపాధ్యక్షుడిగా మురారి మనోజ్ నియమితులయ్యారని జిల్లా అధ్యక్షుడు పొన్నం భిక్షపతి గౌడ్ శనివారం తెలిపారు. బహుజనుల ఐక్యతే అగ్రవర్ణాల రాజకీయ ఆధిపత్యానికి విరుగుడని, ప్రభుత్వాలు సంక్షేమ పథకాల పేరుతో మోసం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో బీఎస్పీని గెలిపించాలని పిలుపునిచ్చారు.