డీజిల్ కోసం ఏకంగా 20 లీటర్ల క్యాన్!
ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం ఇప్పటికే భారత్ పడింది. గ్యాస్ సిలిండర్లకు కొరత ఏర్పడగా త్వరలోనే పెట్రోల్, డీజిల్ కూడా దొరకకుండా అవుతుందని వార్తలు వస్తున్నాయి. దీంతో జనాలు కంగారుపడుతున్నారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి 20 లీ. వాటర్ క్యాన్‌లో డీజిల్ కొట్టించాడు. దీనికోసం అతని వెనుక లైన్లో ఉన్నవారితో కూడా గొడవ పెట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.