యూరియా పంపిణీలో అవకతవకలు.. సర్పంచ్ లేఖ

యూరియా పంపిణీలో అవకతవకలు.. సర్పంచ్ లేఖ

కృష్ణా: ఉంగుటూరు మండలం పోనుకుమాడు గ్రామ సర్పంచ్ అన్నే సుబ్బలక్ష్మి యూరియా పంపిణీలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. తాను 10 ఎకరాల రైతు అయినప్పటికీ PACS నుంచి ఒక్క కట్ట కూడా ఇవ్వలేదని, ఉదయం 6 నుంచి 8 గంటల మధ్య 300 కట్టలు పంపిణీ చేసి, కొంతమందికి 70-100 కట్టలు ఇచ్చారని తెలిపారు. ఈ విషయంపై తగిన చర్యలు తీసుకోవాలని ఎమ్మార్వో, ఏవో, ఏఈఓలకు లేఖ రాశారు.