పెన్షనర్స్ అలర్ట్.. 30 లోపు లైఫ్ సర్టిఫికెట్ మస్ట్!

పెన్షనర్స్ అలర్ట్.. 30 లోపు లైఫ్ సర్టిఫికెట్ మస్ట్!

BPT: పెన్షనర్లు నవంబర్ 30 లోపు లైఫ్ సర్టిఫికెట్ సమర్పించకపోతే వచ్చే నెల నుంచి పెన్షన్ ఆగిపోతుందని మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు హెచ్చరించారు. బాపట్లలో ఆయన సర్టిఫికెట్ల జారీని పరిశీలించారు. వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారికి ఇంటి వద్దే సేవలు అందిస్తామని తెలిపారు. పెన్షన్ సమస్యలున్న వారు యూనియన్‌ను సంప్రదించాలన్నారు.