VIDEO: పోలింగ్ ప్రక్రియకు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ
MBNR: పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యేవరకు పోలీసులు అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఎస్పీ డి. జానకి ఆదేశించారు. గర్ల్స్ జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేసిన పోలింగ్ సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని ఆమె సందర్శించారు. సామాగ్రి పంపిణీ, సిబ్బంది హాజరు, భద్రతా ఏర్పాట్లను ఎస్పీ పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల దగ్గర పరిస్థితులను బట్టి సిబ్బంది చురుకుగా, వేగంగా స్పందించాలని ఆమె సూచించారు.